న్యూస్ పవర్ , 5 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
గత రెండు రోజులుగా కబడ్డీ, వాలీబాల్ ఖో ఖో అథ్లెటిక్స్ ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల సీఎం కప్ క్రీడల పోటీలు ముగిసాయి ఫిబ్రవరి 4 మరియు 5 తేదీలలో జరిగిన పోటీలలో ఖో ఖో బాలుర విభాగంలో ప్రథమ రేపాక ద్వితీయ ఇల్లంతకుంట, బాలికల విభాగంలో ప్రథమ కందికట్కూర్ ద్వితీయ ఇళ్లంతకుంట, వాలీబాల్ బాలుర విభాగంలో ప్రథమ కందికట్కూర్ ద్వితీయ గాలిపల్లి, బాలికల విభాగంలో ప్రథమ గాలిపల్లి ద్వితీయ ఇళ్లంతకుంట, కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ గాలిపల్లి, ద్వితీయ ఇల్లంతకుంట, బాలికల విభాగంలో ప్రథమ ఇల్లంతకుంట, ద్వితీయ గాలిపల్లి విజేతలుగా నిలిచారు. ఇందులో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను త్వరలో జరిగే నియోజక వర్గం స్థాయి, జిల్లా స్థాయికి పంపించబడును.
