ఆపదలో అండగా నిలిచిన గ్రామస్తులు
- బాధిత కుటుంబానికి రూ. 28,500 ఆర్థిక సాయం అందజేత
న్యూస్ పవర్, 5 ఫిబ్రవరి, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీమ్ ఖాన్ పేట
గ్రామంలో ఇటీవల మరణించిన కుడుముల పరుశురాం కుటుంబానికి గ్రామస్తులు మరియు యువత అండగా నిలిచారు. పరుశురాం మరణానంతరం వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో చేసిన విజ్ఞప్తికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు.
మానవతా దృక్పథంతో దాతలు అందించిన విరాళాల ద్వారా సేకరించిన రూ. 28,500/- (ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు) మొత్తాన్ని గురువారం బాధిత కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగింది. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క దాతకు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ సెక్రటరీ సంధ్య , కముటం రాములు, గడ్డమీది శ్రీనివాస్, కూస రవి, కుశాల్ అంజయ్య, నాగుల సాయి, పెద్ది మారుతి, దొంతి అశోక్, దొంతి రవీందర్, కంకటి ప్రభాకర్, దామ అంజయ్య, కొమ్ము కనకయ్య, రాగుల నరేష్, గాజే కనకయ్య, దొంతి శంకర్, దొంతి స్వామి, కట్ట లచ్చయ, సంగెం ఉషయ్య, దొంతి కిరణ్ మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.
