న్యూస్ పవర్ , 12 మే , ఇల్లంతకుంట : అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం సోమవారం ఉదయం తిప్పాపూర్ గ్రామం శివారు లో గల బిక్క వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలియడం తో అక్కడికి వెళ్ళగానే ట్రాక్టర్ వద్ద నుండి తిప్పాపూర్ గ్రామానికే చెందిన బెజ్జంకి శ్రీహరి పోలీస్ వారిని చూసి అక్కడి నుండి పారిపోగా అక్కడ ఉన్న ఇసుకతో కూడిన ట్రాక్టర్ ను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది.ఎవరైనా ఇలా అక్రమంగా ఇసుకను తరలించి నాట్లయితే కేసు చెయ్యడం జరుగుతుందని ఎస్సై హెచ్చరించారు .
0 Comments