సంక్రాంతి నుండి రైతు భరోసా Farmer-Assurance-from-January

సంక్రాంతి నుండి రైతు భరోసా | Farmer-Assurance-from-January |

పంట సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు
సంక్రాంతి నుండి రైతు భరోసా అమలు చేస్తామని అన్నారు,
అసెంబ్లీ లో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా అమలుకు సబ్ కమిటీ వేశామని నివేదిక ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వము రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మొదట ఎకరాకు 4000 రూపాయలు ఇచ్చిందని తర్వాత దానిని 5 వేలకు పెంచారని తెలిపారు ఈ పథకానికి ధరణి పోర్టల్ ఆధారంగా అందులో ఉన్న రైతులు వ్యవసాయం చేయకపోయినప్పటికీ రైతుబంధు అందించారని అన్నారు

రైతు భరోసా పై సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సబ్ కమిటీ మరోమారు సమావేశమై జనవరి 10న క్యాబినెట్లో చర్చించి ఆమోదిస్తారని అనంతరం మార్గదర్శకాలు విడుదలవుతాయి .




Post a Comment

0 Comments