కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
న్యూస్ పవర్ , 30 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వెల్జీపూర్, ఓగులాపూర్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ డైరెక్టర్ నాయిని నవీన్ కుమార్, ఎ.ఏం.సి డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ కలిసి బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనతరం నూతన ఎ.ఏం.సి డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ ను రైతులు, హమాలీ సంఘం కార్మికులు సన్మానించారు.రైతులు, హమాలీ సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments