JSON Variables

ఓటుహక్కును వినియోగించుకోవాలి

ఓటుహక్కును వినియోగించుకోవాలి 

న్యూస్ పవర్, 13 నవంబర్ , ఇల్లంతకుంట :
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుదమని , ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జన విజ్ఞన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్  పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది  వ్యక్తి అస్తిత్వానికి, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. కావున డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని,  ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తును మార్చుకోవడానికి ఓటు అనేది కీలకమైనది. ప్రతి ఒక్కరు ప్రలోభాలకు లొంగకుండా నిజమైన నాయకున్ని ఎన్నుకోవాలి. అప్పుడే మన జీవితాలలో మార్పు వస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ సావనపల్లి రవి, కాసుపాక శంకర్, సావనపల్లి రాములు, గొట్టుముక్కల చక్రపాణి, కోలమద్ది పరశురాములు తెలంగాణ శ్రీనివాస్, అంతటి తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments