JSON Variables

ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వాదించండి అభివృద్ధి చేసి చూపిస్తా - కవ్వంపల్లి


ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వాదించండి అభివృద్ధి చేసి చూపిస్తా - కవ్వంపల్లి
  న్యూస్ పవర్ , 14 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం అనంతగిరి, దాచారం, అనంతారం గ్రామాలలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ ప్రచారాన్ని నిర్వహించారు  ఈ సందర్భంగా కవ్వంపల్లి  మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వాదంచాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని ఓటర్లను అభ్యర్థించారు  కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని నిరుద్యోగులు, యువతకు ఉపాధి కల్పించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరిట ప్రజలను మోసం చేశారన్నారు  మాయ మాటలతో మోసం చేసిన బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని. ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గం ప్రజలకూ న్యాయం జరగలేదని తెలిపారు.   కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని, కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని, రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.   తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.  నిత్యం ప్రజల మధ్య ఉంటూ పోరాడుతున్న  ఒక్క అవకాశం ఇవ్వాలని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments