భారీ మెజారిటీతో గెలిపించాలి
• కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ
న్యూస్ పవర్ , 4 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి, గ్రామంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి పాల్గోన్నారు, ఈ సందర్భంగా
మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ని హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని గ్రామంలోని కార్యకర్తలను కోరారు . కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments