JSON Variables

కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు 


• కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మలిదశ ఉద్యమకారుడు కంకటి ప్రభాకర్ 
• రేపాక గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
• కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించిన డాక్టర్  కవ్వంపల్లి సత్యానారాయణ 

 న్యూస్ పవర్ , 11 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల ముదిరాజ్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు  తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కంకటి ప్రభాకర్  డాక్టర్  కవ్వంపల్లి సత్యనారాయణ  ఆధ్వర్యంలో 30 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కంకటి ప్రభాకర్ మాట్లాడుతూ  తెలంగాణా ఉద్యమకారులను బిఆర్ఎస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై కేసులు కూడా నమోదు అయ్యాయి అని ఏనాడూ పార్టీ పట్టించుకోలేదని బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని బానిసల రాష్ట్ర సమితి అని అన్నారు అందుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు,

రేపాక,గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు ఉద్యమ కరుడు గన్నేర్ వరం శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు పతేమ్ రాజు రొండ్ల సురేందర్ రెడ్డి రేపాక ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు రొండ్ల మాధవ రెడ్డి వార్డుమెంబర్ పావని కిష్టారెడ్డి  కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంపీటీసీ సుమలత -మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ సాగర్ మండల కాంగ్రెస్ నాయకులు రొండ్ల రాజిరెడ్డి, చెందు లక్ష్మమాన్ కమల్ల శ్రీనివాస్ గొర్ల యాదగిరి శేఖర్ యువకులు, కార్యకర్తలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments