JSON Variables

కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆగమై పోతారు



కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలు ఆగమై పోతారు

 న్యూస్ పవర్ , 10 నవంబర్ , ఇల్లంతకుంట :
కాంగ్రెస్ కు సద్దికడితే ప్రజల నోట్లో మట్టికొడతారని అరవై ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తారని కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెలుతుందని,కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ లేదని కవ్వంపల్లి మాటలకు వారంటీ లేదని, మానకొండూర్ ఎమ్మెల్యే,  రసమయి బాలకిషన్ అన్నారు.
ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్, పాండలపురం, రంగంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కందికట్కూర్ ప్రజలు, ఆడబిడ్డలు డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా బతుకమ్మలు,బోనాలతో ఘనస్వాతం పలికారు.
కందికట్కూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 60 మంది మంది బీఆర్ఎస్ లో చేరగా  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఒక్క చాన్స్ అనే పేరుతో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని అన్నారు.
ఒకప్పుడు సాగునీళ్లు, త్రాగునీళ్లు లేక గల్ఫ్ దేశాలు, ముంబాయి, హైదరాబాద్,భీవంటి ప్రాంతాలకు వలస పోయిన రైతులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చిన తర్వాత రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు కూలీలను వలస తీసుకువచ్చే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.
రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ₹10వేల పెట్టుబడి సాయం, రైతుభీమా ద్వారా రైతులు మరణిస్తే₹5లక్షల సాయం చేయడం జరుగుతుందన్నారు.
రైతులకు మరింత అండగా ఉండాలనే లక్ష్యంతో రైతుబంధు సాయాన్ని₹16వేలకు పెంచడం జరుగుతుందన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి ₹5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఆడబిడ్డల పెళ్లికి నయాపైసా సాయం లేయలేదని, కేసీఆర్ సీఎం అయ్యాక కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా₹లక్ష సాయం చేయడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ వచ్చేదని...కేసీఆర్ సీఎం అయ్యాక వికలాంగులకు₹4016, ఆసరా ద్వారా ₹2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మేనిఫెస్టోలో వికలాంగులకు₹6016, ఆసరా పెన్షన్ లబ్దిదారులకు₹5016 పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఏడాది కాలంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని....కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి 5గంటల కరంటు ఇస్తున్నారని....గసొంటి దొంగలబండి కాంగ్రెస్ పాలన కావాలా అన్నారు.
తెలంగాణ లో వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతుందని...రైతులకు ఎప్పుడూ అవసరం ఉంటే అప్పుడు చెరువుల్లోకి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆరు గ్యారెంటీ ల పేరుతో ఊర్లలోకి వస్తున్న ఊసరవెల్లి కవ్వంపల్లి సత్యనారాయణ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని అన్నారు.
మళ్ళీ అధికారంలోకి రాగానే ₹400లకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, రేషన్ కార్డున్న వారందరికీ సన్నబియ్యం, ప్రతి. కుటుంబానికి₹5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
ఎన్నికలు కాగానే ప్రతి దళిత కుటుంబానికి ₹10లక్షల సాయం అందిస్తామని పేర్కొన్నారు.


Post a Comment

0 Comments