JSON Variables

ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 •  జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం
• పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 31 మార్చి,2024 వరకూ  విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది
• దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ నెల 9



న్యూస్ పవర్ , 8 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్) , పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియోగ్రాఫర్ పోస్టు), ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను
పొరుగు సేవల పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తెలిపారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సహాయ పౌర సంబంధాల అధికారి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు  జర్నలిజం సబ్జెక్ట్ గా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలన్నారు. లేదంటే కనీసం  సాధారణ బ్యాచిలర్ డిగ్రీ తో పాటు  జర్నలిజం లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నారు.

పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫోటో గ్రాఫర్) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం 10వ తరగతి విద్యా ర్హత కలిగి, ఏదైనా రిప్యూటేడేట్  ఫొటోస్టూడియోలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలని చెప్పారు. 


ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం 7 వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.

ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను  సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోనీ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో  ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత అర్హత పత్రాల తో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆదివారం ( ఈ నెల 8 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు) కూడ దరఖాస్తులు స్వీకరిస్తానని చెప్పారు. గడువు మీరిన తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవని తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు 31 మార్చి,2024 వరకు   ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిపిఆర్ఓ కార్యాలయంలో  విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

జిల్లా కలెక్టర్ గారు నియమించిన జిల్లా స్థాయి కమిటీ వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు. 

Post a Comment

0 Comments