JSON Variables

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత ఆన్లైన్ కోచింగ్

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత ఆన్లైన్ కోచింగ్


న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నడపబడుతున్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ (ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం) ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీ. డి. శ్రీనివాస్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలియజేశారు.
    అర్హులైన అభ్యర్థులందరూ ఈ నెల 13 తేదీలోపు రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్లో నేరుగా వచ్చి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగలరని బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి  తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు సమర్పించవలసిన ధృవీకరణ పత్రములు 
1. SSC
2. Inter 
3. Degree
4. B.Ed/TTC
5.Caste
6.income latest
7. Aadhar card
8. TET qualify marks memo xerox.
9. DSC application application form xerox.
10. passport size photos 2 
లతో రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 13 లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 08723-223004,9381888743 ఆఫీస్ వేళల్లో సంప్రదించాలని సూచించారు.    



       

Post a Comment

0 Comments