JSON Variables

మండలం కేంద్రంను దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించాలిమండలం కేంద్రంను దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించాలి 

• డబుల్ బెడ్ రూం పథకంలో రిజర్వేషన్ అమలు చేయాలి 
•మండల వ్యవసాయ మార్కెట్ కు అంబేద్కర్ పేరు  పెట్టాలి
 • శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ కి విజ్ఞప్తి 
• ఏమ్ . రాజు యువజన సంఘాల సభ్యుడు

న్యూస్ పవర్ , 1 అక్టోబర్ , ఇల్లంతకుంట 
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన యువజన సంఘాల సభ్యుడు ఏమ్ . రాజు ఒక ప్రకటనలో తెలియజేస్తూ మండల  కేంద్రంలోని దళితులకు  చెందిన 5ఎకరల భూమిని 2016సంవత్సరంలో ప్రభుత్వం రైతులకోసం వ్యవసాయ మార్కెట్ కోసం తీసుకోవడం జరిగింది.దానితో దళితులలో చదువుకున్న నిరుద్యోగులు తమ విలువైన భూమిని కోల్పోవడం జరిగింది.మండల కేంద్రంలో దళిత కుటుంబాలకు చెందిన యువతి , యువకులు  గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి   ఉన్నందున మానవీయ కోణంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఇల్లంతకుంట మండల కేంద్రంను ప్రకటించి ప్రతి దళిత కుటుంబంనకు న్యాయం చేయాలని ,అదే విధంగా మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం పథకంలో దళిత కుటుంబలాకు రిజర్వేషన్ కోటా అమలు చేసి న్యాయం చేయాలని , అంతే కాకుండా మండల వ్యవసాయ మార్కెట్ కు అంబేద్కర్  పేరును , పెట్టాలని పత్రిక ప్రకటనలో  శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కి విజ్ఞప్తి చేశాడు.


         

Post a Comment

0 Comments