JSON Variables

మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఇల్లంతకుంట యువకులు


మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఇల్లంతకుంట యువకులు

• 22వ సారి రక్తదానం చేసిన ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్

న్యూస్ పవర్ , 26 అక్టోబర్ , ఇల్లంతకుంట :
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ  అఖిల్.మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఇల్లంతకుంట మండలం నుంచి పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నట్టు ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ పిలుపుమేరకు మండలంలోని యువకులు స్వచ్ఛందంగా ఈ రక్తదానంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు, వల్లంపట్ల, ఇల్లంతకుంట, సోమారంపేట, తిప్పాపూర్, గాలిపెల్లి ,వెల్జిపూర్ గ్రామాల నుండి  బాపు చందర్, రాజు, కిషన్, రజినికుమర్, వంశిధర్ రెడ్డి, స్వామి, మరియు దాదాపు 23 మంది యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో మంది ప్రాణాలు నిలబెట్టి ప్రాణదాతలుగా నిలవడానికి అవకాశం ఉందని, నిరంతరం రక్తదానం చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉంటారని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో 22వ సారి, రక్తదానం చేసిన ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ ను, 34 వసారి రక్తదానం చేసిన మామిడి.రాజు ను ఉన్నతాధికారులు అభినందించారు. రక్తాన్ని దానం చేసిన రక్తదాతలకు సిరిసిల్ల డిఎస్పి  ఉదయ్ రెడ్డి చేతుల మీదుగా రక్తదాన పత్రాలను అందజేసినట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments