JSON Variables

గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి

గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి 

న్యూస్ పవర్ , 22 అక్టోబర్, ఇల్లంతకుంట:
కరోన కష్టకాలంలో ప్రాణాలను తెగించి మరి విధులు నిర్వర్తించి న సఫాయి కార్మీకులు, గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రతి ఒక్కరు మరిచి పోలేరని, వారి సేవలు ఎప్పటికి గుర్తుంటాయని  ఇల్లంతకుంట ఎంపిటిసి సభ్యుడు  వొగ్గు నర్సయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు. చిరు కానుకలను అందజేశారు. ఇల్లంతకుంట పట్టణ మరియు మండల ప్రజలకు బతుకమ్మ,దసర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వర్తక, వ్యాపారవేత్తలు, నాయకులు, యువజన సంఘ సభ్యులు పాల్కొన్నారు.


Post a Comment

0 Comments