JSON Variables

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి


• ప్రెసిడెంట్ మారుపాక అనిల్ కుమార్
• టియూడబ్యుజే ఐజేయు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి

న్యూస్ పవర్ , 2 అక్టోబర్, ఇల్లంతకుంట :
దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టీయూడబ్యుజే (ఐజేయూ) మారుపాక అనిల్ కుమార్ కోరారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ)రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో జర్నలిస్టు ఐక్యత కోసం గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ  ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టు అందరికీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రాణాలకు తెగించి మరి జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమ వార్తలను కవర్ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాగటి మహేందర్,రాకం సుమన్, దయ్యాల సురేష్, కముటం పర్శరాం, బండారి శ్రీనివాస్, కందారం అంజనేయులు, వెగ్గళ్లం కిషన్, కిష్టస్వామి, ఎనుగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments