JSON Variables

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలి

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలి

న్యూస్ పవర్,5 ఆగస్టు , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జాక్  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాదనోద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన దళితులను బి ఆర్ ఎస్ పార్టీ  అధికారం లోకి రాగానే విస్మరించినారు,తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తా అని చెప్పిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చివరికి అధికారం లోకి రాగానే దళితులను మోసం చేసి తానే ముఖ్యమంత్రి అయ్యాడు,భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఓట్లు దండుకొని రెండవసారి అధికారం లోకి వచ్చిన దళితుల పట్ల కపటప్రేమ చూపిస్తూ కేవలం ఓటు బ్యాంక్ మాత్రంగానే ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారు,ముఖ్యమంత్రి కెసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో ఉపఎన్నికల ముందు ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం పేరిట 10 లక్షలు ఇస్తా అని హామీ ఇచ్చి కేవలం హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత కుటుంబాలకు ఎలక్షన్ కి ముందు ఓట్ల కోసం దళిత బంధు అమలుచేసి అక్కడక్కడా నామమాత్రంగా పంపిణి చేసి మళ్ళీ మోసం చేశారు దళిత ఎమ్మెల్యే లు ఎస్సీ రిజర్వేషన్ లో పదవులు పొందుతూ కోట్ల రూపాయలు, ఆస్తులు, భూములు అక్రమంగా సంపాదించుకొని రాజబోగాలు అనుభవిస్తున్నారు కానీ దళితుల సమస్యలు విస్మరిస్తూ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారు  దళిత ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశంలో చర్చించి రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయడానికి కృషి చేయాలనీ డిమాండ్ చేస్తూ లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు,తగిన గుణపాఠం చెప్పడానికి దళిత మేధావులను , నాయకులను,అంబేద్కర్ వారసులను ఏకం చేసి దళిత సంఘాల జాక్  ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామణి హెచ్చరించారు.


Post a Comment

0 Comments