JSON Variables

బిసి బంధు అందరికి అందించాలి

బిసి బంధు అందరికి అందించాలి

న్యూస్ పవర్, 8 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట - బిసి అందరికి అందించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ దళిత బంధు అంటూ మురిపించారు, అది అందరికి అందలేదని, ఇప్పుడు బిసి బంధు అంటూ ఇప్పుడు బిసి జపం చేస్తున్నారని, ఇచ్చే లక్ష సహాయానికి ఎన్నో ఆంక్షలు మరి అందులో కొన్ని బిసి కులాలకు బిసి బంధు లేదన్నారు. ఎందుకు అన్ని బిసి కులాలకు బిసి బంధు అందించడంలేదని, కులాలు మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లాభం పొందుతున్నారాని, అలా కాకుండా ప్రతిఒక్క బిసి కుటుంబానికి తప్పకుండా బిసి బంధు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

Post a Comment

0 Comments