JSON Variables

తహశీల్దార్ కార్యాలయం ముంధు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

తహశీల్దార్ కార్యాలయం ముంధు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

న్యూస్ పవర్ , 21 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట  మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముంధు దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసిల్దార్ కి వినపత్రం ఇవ్వడం ఇచ్చారు  తదనంతరం ప్రజా సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలమైందని అన్నారు, మండలములోని పలు గ్రామాలలో మానకొండూర్ శాసనసభ్యుడు  రసమయి బాలకిషన్  డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసి నేటికీ ఎనిమిది సంవత్సరాలు గడిచిన పూర్తి నిర్మాణం చేసి లబ్దిదారులకు పంపిణి చేయక పోవడం చాలా సిగ్గు చేటు అన్నారు, చిన్నపాటి వర్షాలు పడిన రోడ్ల పరిస్థితి మరి అధ్వానంగా మారింది, నియోజకవర్గంలో గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదని అన్నారు,అర్హులైన నిరుపేద కుటుంబాలకు గృహలక్ష్మి పథకం వెంటనే మంజూరు చేయాలి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి నిర్మాణం చేసి వెంటనే లబ్దిదారులకు పంపిణి చేయాలి, హుజురాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి  దళిత బంధు పంపిణి చేసిన మాదిరిగా మానకొండూర్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేనియెడల స్థానిక ఎమ్మెల్యే గారిని నాయకులను గ్రామాలలో ప్రజలు తిరుగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
 ఈ కార్యక్రమం లో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్, మాజీ సర్పంచ్ సుంకపాక ఎల్లయ్య, ప్యాక్స్  మాజీ డైరెక్టర్ పసుల నరేష్ కుమార్, సిఐటియు  మండల అధ్యక్షుడు సావనపెల్లి రాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు సావనపెల్లి శంకర్, అంబేద్కర్ సంఘాల నాయకులు బిగుళ్ల పర్శరాములు, రామంచ నర్సయ్య, నాగరాజు, ప్రవీణ్, రాయమల్లు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments