JSON Variables

బిసి బందు ద్వారా కులవృత్తుల వారికి లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ

బిసి బందు ద్వారా కులవృత్తుల వారికి లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ

న్యూస్ పవర్ , 22 ఆగస్టు , ఇల్లంతకుంట :
కుల వృత్తులకు జీవం పోయాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసిఆర్ బీసీ బందుకు శ్రీకారం చుట్టారని  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు మానకొండూర్ నియోజక వర్గ క్యాంప్ కార్యాలయం లో మంగళ వారం రోజున ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులు 53 మందికి బీసీ బందు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కుల వృత్తులపై ఆధారపడిన పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యం తో కేసిఆర్ బీసీ బందు పథకం ద్వారా లక్ష రూపాయల సాయం అందించడం జరుగుతుందనీ పేర్కొన్నారు సిఎం కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉన్నారని ఆయన తెలిపారు ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలం ఉంటే గృహ లక్ష్మి పథకం.కింద ₹ 3లక్షల సాయం చేయడం జరుగుతుందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు కరీంనగర్ జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ ఇల్లంతకుంట మండల వైస్ ఎంపిపి సుదగొని శ్రీనాథ్ గౌడ్ మాజీ ఏఎంసి ఛైర్మెన్ చింతలపల్లి వేణురావ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహరెడ్డి మరియు సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments