JSON Variables

రోగులకి ఎలాంటి ఆటంకం జరగకుండా చూడాలి


రోగులకి ఎలాంటి ఆటంకం జరగకుండా చూడాలి 


న్యూస్ పవర్ , 21 ఆగస్టు , ఇల్లంతకుంట :
జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు  ఇల్లంతకుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి విచ్చేసి ఆకస్మికంగా  తనిఖీ చేసినారు రోజు వారి ఓపి, జ్వర రోగుల నమోదు,సిబ్బంది సమయ పాలన, రక్త పరీక్షలు, మందులు అందుబాటు అన్నీ పరిశీలన చేసినారు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేల రోగులకి ఎలాంటి ఆటంకం జరగకుండా చూడాలి అని వైద్యాధికారులకు అండ్ సిబ్బందికి ఆదేశించారు అనంతరం అన్నీ ప్రోగ్రామ్స్ పైన  రివ్యూ మీటింగ్ తీసుకున్నారు గర్భిణీ స్త్రీల నమోదు పెంచాలి, గవ్నమెంట్ డెలివరీ లు అయ్యేల మోటివేషన్ చేయాలి, గర్భిణీ స్త్రీల చెక్ అప్స్ పూర్తి చేయాలి, పిల్లల టీకాలు వేయించి అప్డేట్ చెయ్యాలి, టిబి కేసెస్ టార్గెట్ రీచ్ అయ్యేలా చుస్కోవాలి, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి డ్రై డే చేయాలి, మిగతా అన్నీ ప్రోగ్రామ్స్ ఎప్పటికి అప్పుడు అప్డేట్ చెయ్యండి అని ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో మండల వైద్యాధికారులు డాక్టర్ కట్ట రమేశ్, డాక్టర్ శరణ్య, ఆయుష్ డాక్టర్ శరణ్య, హెచ్ ఈ ఓ లింగం, సి హెచ్ ఓ శాంత, హెచ్ ఈ ఓ వెంకట రమణ, పి హెచ్ న్ లలిత కుమారి, సూపర్వైజర్ జవహర్, ఏఎన్ఎంలు, ఆశాలు, మిగతా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments