JSON Variables

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా 
న్యూస్ పవర్ , 17 ఆగస్టు , ఇల్లంతకుంట :
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను వెంటనే నెర వేర్చాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇoన్చార్జ్ గడ్డం నాగరాజు  మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు, ప్రజలకు, మహిళకు, వివిధ సామాజిక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.రైతు రుణమాఫీ, దళితులకు మూడెకారులు, దళిత బంధు, బిసి బంధు, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నీళ్లు, నియామకాలు,నిధులాంటి హామీలను స్వార్ధరాజకీయాల కోసం వాడుకుంటూ అరచేతిలో స్వర్గం చూపించడం తప్ప అమలు చేయడంలేదని విమర్శించారు. విద్యార్థులు బలిదానాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని  సాధించుకుంటే వారి త్యాగాల గద్దెలపై కుర్చీలు వేసుకొని భోగాలు అనుభవిస్తున్నది కల్వకుంట్ల కుటుంబామని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసిఆర్ తన తల ఎక్కడ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ  అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బూటకపు కార్యక్రమాలతో ప్రజలను గందరగోళంలో పడవేస్తూ ఉంది ఈ ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతిల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మోడీ ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారానే జరుగుతుందని కెసిఆర్ ప్రభుత్వం చేసింది అంతా డొల్లేనని తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కి అత్యధిక నిధులు తీసుకువచ్చిన ఘనత  బండి సంజయ్ కుమార్ గారిదే అని అన్నారు. మానకొండూరు నియోజకవర్గం లో ఎంతమంది పేద దళితులకు ప్రజలకు  సంక్షేమ పథకాలు అందించారో రసమయి బాలకిషన్  సమాధానం చెప్పాలని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్  వస్తుంది అని బీజేపీ మొదటి గెలుపు మానకొండూరు నియోజకవర్గం నుండే మొదలు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలోబీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్,ఓబీసీ జిల్లా కోశాధికారి చెప్యాల గంగాధర్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరిష్,సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం, దోనపాటి సంపత్,పట్టణ అధ్యక్షుడు గంగం అనిల్,మండల అధికార ప్రతి నిది పుణ్ణి రాజు,భూమల్ల ప్రశాంత్,బీజేవైఎం మండల అధ్యక్షుడు పుణ్ణి సంపత్,మహిళ మోర్చ ప్రధాన కార్యదర్శి కొలనూర్ ముత్తక్క,దళిత మోర్చ మండల ఉపాధ్యక్షులు కట్కూరి తిరుపతి, దళిత మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్, బూత్ అధ్యక్షులు కుడుముల శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments