JSON Variables

ఇల్లంతకుంటలో రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు

ఇల్లంతకుంటలో రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు

న్యూస్ పవర్ , 20 ఆగస్టు , ఇల్లంతకుంట :
భారతదేశంలో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేనని పసుల వెంకటి అన్నారు, రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలను మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో వెంకటి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడారు. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు  తీసుకువచ్చి, సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించి భారతదేశాన్ని కంప్యూటర్ రంగంలో లో ముందంజ లో ఉంచిన ఘనత రాజీవ్ గాంధీ ది అన్నారు. నేడు అంతర్జాతీయ ఐటీ సంస్థలకు గ్రామాల నుండే  వర్క్ ఫ్రం హోం  చేస్తున్నారంటే ఆ ఘనత రాజీవ్ గాంధీ దేనని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయకుండా కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వ రంగ సంస్థ లను కనుమరుగు చేస్తుందని అన్నారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు వస్తున్నాయంటే రాజీవ్ గాంధీ చొరవ వల్లనేనని వెంకటి అన్నారు. ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ఆర్థికంగా రాజీవ్ గాంధీ ముందుకు తీసుకు వచ్చారని తెలిపారు.  దేశంలో
ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పడిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించి మహిళా ప్రపంచాన్ని ముందుకు నడిపిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం రెండు ప్రాణాలు అర్పించి వారు దేశ సేవకే అంకితం అయ్యారని అన్నారు. రాజీవ్ గాంధీ సతీమణి అయిన సోనియా గాంధీ ఏ ఐ సీసీ అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సిద్ధింపజేసిన కాంగ్రెస్ పార్టీనీ గెలిపించడం కోసం కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను  కోరారు. ఈ కార్యక్రమంలో  వెంకటి తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు మచ్చ రాయసం టౌన్ అధ్యక్షులు మామిడినరేష్ఆ ల్లెపు రజినీకాంత్ జెట్టి మల్లేశం రేపాక గ్రామ శాఖ అధ్యక్షులు దయాసాగర్ సుగుణాకర్ రెడ్డి నరసింగం రవీందర్ సుదవోలు తిరుపతి గౌడ్ కాష్ పాక రమేష్ జెట్టి కృష్ణ సాయి రాకేష్ రాజ స్వామి తిరుపతి తిరుపతికార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments