JSON Variables

నిరవధిక దీక్ష చేపట్టిన గ్రామ పంచాయతీ యూనియన్ మద్దతుగా ఎస్ఎఫ్ఐ (భారత విద్యార్థి ఫెడరేషన్)

నిరవధిక దీక్ష చేపట్టిన గ్రామ పంచాయతీ యూనియన్ మద్దతుగా ఎస్ఎఫ్ఐ (భారత విద్యార్థి ఫెడరేషన్)

 న్యూస్ పవర్ , 6జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో చేపట్టిన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ధీక్ష కి మద్దతుగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్
 ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి కనీస వేతనం 19,000 ఇవ్వాలని అలాగే, పర్మనెంట్ చేయాలని ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీలు ద్వారా వేతనాలు ఇవ్వాలి. కరోబార్ బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శి గా నియమించాలి. జీవో నెంబర్ 51 సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూపాయలు ఐదు లక్షల పెంచాలి. పంచాయతీలో ఆదాయమును చోట వేతనలు పెంపుకు అనుమతించాలి. 2011 జనాభా ప్రకారం కాకుండా అవసర ప్రతిపాదన కార్మికుల్ని తీసుకోవాలి. గ్రాట్యూటీ గుర్తింపు కార్డు ఇవ్వాలి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. వారాంతపు సెలవులు పండుగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవు దినాలను అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కూలర్ రద్దు చేయాలి. గ్రామపంచాయతీ సిబ్బందిని అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలి వివిధ పంచాయతీల్లో కొత్తగా నియమించిన వారిని సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానం చేయాలి. డిపిఓ అనుమతి తర్వాత నియామకాలు జరగాలి ట్రాక్టర్ డ్రైవర్లకు గ్రామ పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. వయస్సు మీరిందని సాకుతో కార్మికులు మార్చితే ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. రిటర్మెంట్ బెనిఫిట్ రూపాయలు ఐదు లక్షలు ఇవ్వాలి. సంవత్సరానికి మూడు జాతుల యూనిఫాం సరిపడ చెప్పులు సభ్యులు నూనెలు ఇవ్వాలి వాటికి నగదు రూపంలో అలవెన్స్ గా చెల్లించాలి. గ్రామాలలో బీసీ, ఎస్ సి, ఎస్టీ లు కార్మికులుగా కొనసాగుతున్నారన్నారు. కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి పై డిమాండ్లు పరిష్కారం త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరని ఎడల ఉద్యమం మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు మల్లేశం, నల్ల చందన, శీలం బాబు, కంసాల లక్ష్మణ్,మంద బాలలక్ష్మి, మహేందర్, ఎల్లయ్య యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments