ఆస్పత్రిలో మౌళిక వసతుల ఏర్పాట్లకు కృషి- ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి

ఆస్పత్రిలో మౌళిక వసతుల ఏర్పాట్లకు కృషి

-  ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి 

న్యూస్ పవర్, 6 జూలై , ఇల్లంతకుంట : 
మండల ప్రజలకు మేరుగైన వైద్య సేవలను అందించాలని ఇల్లంతకుంట ఎంపీపీ,ఆస్పత్రి చైర్మన్  వుటూకూరి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రిలో ఆయన వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి ఓపి పేషెంట్ల సంఖ్య పెరిగిందని, అదేవిధంగా సర్కారు దవఖానాలో  ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు,

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని మౌలిక వసతులు, కల్పించేందుకు  మానకొండూరు శాసనసభ్యుడు  రసమయి బాలకిషన్  ఏర్పాట్లు చేస్తున్నారని,  త్వరలోనే ఆసుపత్రిలో నూతన భవనాన్ని నిర్మించుకొని ప్రజలకు మరింత సేవలు అందిస్తామన్నారు,

వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వారి సేవలను అందించాలని సూచించారు,

ఈ కార్యక్రమంలో వైధ్యాధికారిణీ శరణ్య, కట్ట రమేష్, ఎపిఎం వాణీశ్రీ,  సర్పంచ్ లు కూనబోయిన భాగ్యలక్ష్మీ, కట్ట వెంకట్ రెడ్డి, తుంకుంట శ్రీలతరెడ్డి, చింతలపెల్లి శ్రీలత, ఎంపిటిసిలు తీగల పుష్పలత, కవివేద స్వప్న , నాయిని స్రవంతి రమేష్, వైధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments