JSON Variables

విద్యార్థులు ఏం పాపం చేశారు

విద్యార్థులు ఏం పాపం చేశారు
భారత విద్యార్థి ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ
ఇల్లంతకుంట మండలనికి 30పడకల ఆసుపత్రి మంజూరు కావడం చాలా సంతోషం వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళటం మధ్యలోనే మరణించిన పరిస్థితి ఉండేది అన్నారు, ఇది కేటీఆర్  పుట్టిన రోజు సంద్భంగా మనకి ఇచ్చిన బహుమతి అని చెప్పుకుంటున్న మరి వారి ఈ 9సం "ల పుట్టిన రోజు బహుమతులు ఎక్కడ పోయే అని ఎద్దేవా చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విద్యార్థులకు కేజీ టు పీజీ  ఉచిత విద్య అందిస్తాం అని హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు అమలు కానీ పరిస్థితి అన్నారు, మండలంలో డిగ్రీ, పీజీ చదువుల నిమిత్తం 50కి.లో.మి దూర ప్రాంతాలకు వెళ్ళ లేక సమయానికి బస్సు సౌకర్యం లేక ఇంటికే పరిమితం అవుతున్నారు,
 మండల కేంద్రంలో అన్ని అభివృద్ధి చేశాం అంటూ గోప్పలు చెప్పుకుంటున్నా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్  మండల కేంద్రంలో ఇప్పటివరకు  కేజీ టు పీజీ ఉచిత విద్య ఏర్పాటు చెయ్యలేదు, గురుకుల పాఠశాలకు పక్క భవనం ఏర్పాటు చేయలేదు, (అద్దె భవనంలో ఇరుకుగా ఒకే గదిలో రెండు క్లాసులు చెప్పుకుంటున్నారు, డ్రైనేజీ వాటర్ పోవటానికి మోరి లేదు), కేజీబీవీ పాఠశాలకు రోడ్డు సౌకర్యం లేదు, తరగతి గదులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఎస్సీ బాలురు హాస్టల్ కి పక్క భవనం ఏర్పాటు చెయ్యాలి అద్దె భవనలతో అగం అవుతున్న పరిస్థితి, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడలు, మర్గుదొడ్లు, మధ్యన భోజనం ఏర్పాటు చెయ్యాలి, రేపాక, సోమారంపేట,గొల్లపల్లి,వెంకట్రావు పల్లె, అరెపల్లె, కేసన్న పల్లె గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి, పత్తికుంట పల్లె, తాళ్ళపెల్లి కి పొద్దుగాల వస్టే సాయత్రం కంటికి కనిపించని బస్సులు పరిస్థితి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి, మండలంలో ఇన్ని విద్యారంగ సమస్యలు పెట్టుకొని అన్ని చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో మీరు పంతులు పని చేసిన అని గొప్పలు చెప్పినారు, ఇప్పుడు అధికారం లో ఉండి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. మీరు వేసిన ఎక్కడి గొంగడి అక్కడే ఉంది అని గుర్తుచేశారు.  విద్యార్ధులు అంటే మీకు చిన్న చూపు అన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించని డిమాండ్ చేశారు. లేని యడల మి గెస్ట్ హౌస్ ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

Post a Comment

0 Comments