JSON Variables

నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడుతాం

నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడుతాం
జనం న్యూస్ , 25 జూలై , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి 30 పకడల ఆసుపత్రి కి 9కొట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, మంత్రి కేటీ ఆర్ జన్మదినం సందర్భంగా మాకు జీవో విడుదల కావడం ఆయన గిప్ట్ గా బావించుకుంటున్నామని  మానకొండూర్ శాసన సభ్యుడు  రసమయి బాలకిషన్ అన్నారు, మండల కేంద్రంలోని పీహెచ్‌సీని  వారు తనిఖీ చేశారు,అనంతరం  ముఖ్యమంత్రి కేసీ ఆర్ ,కేటీ ఆర్,హరీష్ రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా  మాట్లాడుతూ 30 పడకల ఆసుపత్రి. మంజూరి చేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కి , మంత్రులు కేటీ ఆర్ ,హరీష్ రావు , బోయినిపెల్లి వినోద్ రావు కు కృతజ్ఞతలు తెలిపినారు,కొద్ది రోజులలో ఇల్లంతకుంట ప్రజల ఇబ్బందులు తీరుతాయన్నారు,
గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లంతకుంట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని అన్నారు, ప్రస్తుతం 6 పడకల ఆసుపత్రిగా ఉన్న దానిని 30 పడకలకు స్థాయి పెంచడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు,
మాకు మండల అభివృద్ది పై చిత్త సుద్ది ఉంది అన్నారు..నాడు 30పడుకల ఆసుపత్రి కావాలని  మంత్రి కేటీ ఆర్  ధృష్టికి తీసుకవెల్లింది మేమే నని నేడు మంజూరి కొరకు కృషి చేసింది మేమే నని ఆయన గుర్తుకు చేసారు.కొన్ని ప్రతి పక్షాలు మా వల్లె 30పడుకుల ఆసుపత్రి మంజూరి అయిందని జబ్బలు జరుసుకుంటుండ్రు అది వారి విజ్ఞతకే వదేలేస్తున్నామని అన్నారు,ఆలాగే సిద్దిపేట నుండి ఇల్లంతకుంట మండల కేంద్రాని డబుల్ రాబోతుందని పనులు మొదలైనాయి అన్నారు,మండలంలో ఇప్పటికే మిడ్ మానేరు,అన్నపూర్ణ ప్రాజెక్ట్ లు పూర్తి అయి ఇల్లంతకుంట మండలం కలకలాడుతుందని రైతులు ఆనందంతో ఉన్నారని అన్నారు,
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, స్థానిక ఎంపిటిసి ఒగ్గు నర్సయ్య యాదవ్, స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి రైతు సమన్వయ సమితి చెరుకుపల్లి రాజిరెడ్డి , మండల వైద్య అధికారులు  కట్ట రమేష్ , శరణ్య వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపిటిసిలు, సర్పంచ్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments