JSON Variables

రాయితీపై పండ్ల తోటల పెంపకకానికి అవకాశం

రాయితీపై పండ్ల తోటల పెంపకకానికి అవకాశం 

జనం న్యూస్, 20జూలై , ఇల్లంతకుంట :
ఉపాధి హామీ పథకం క్రింద తెలంగాణ ప్రభుత్వం చిన్న, సన్న కారు రైతులకు రాయితీపై పండ్ల తోటల పెంపకకానికి అవకాశం కల్పించింది. ఈ పథకం లో భాగంగా ఉపాది హామీ జాబ్ కార్డ్ కలిగి ఉండి, అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న, సన్న, చిన్నకారు రైతులు అర్హులు. ఈ స్కీంలో పండ్ల తోటలలో బిందు సేద్యము కల్పిస్తారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, మిగిలిన సామాజిక వర్గాల రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్పు పరికరాలు అందిస్తారు. ఉపాధి హామీ పథకం క్రింద మట్టి నమూన పరిశీలనకు చార్జీలు మరియు గుంతలు తీయడం, మొక్కలు నాటడం, ఉపాది హామీ కూలీల తో చేయిస్తారు. బ్రతికిన మొక్కకు మూడేండ్ల పాటు ప్రతి నెల 10/- వాచ్ అండ్ వార్డ్ కోసం చెల్లిస్తారు. కావున మండలంలోని అన్ని గ్రామాల రైతులు వారి భూములలో పండ్ల తోటల పెంపకం నకు సంబంధిత గ్రామాల పంచాయితీ కార్యదర్శులకు తేది 31-07-2023 రోజు లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు. 

Post a Comment

0 Comments