JSON Variables


నేడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం

జనం న్యూస్ , 19 జూలై, ఇల్లంతకుంట :
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము సందర్భముగా నులిపురుగుల వల్ల పిల్లల్లో ఏర్పడే రక్తహీనత,పౌష్ఠికాహారలోపం,ఆకలి మందగించటం,బలహీనత,ఆందోళన,కడుపు నొప్పి,వాంతులు,అతిసారం,బరువు తగ్గటం,మొదలగు లక్షణాలు కనిపిస్తాయి.వీటి నిర్మూలనకు 1 సంవత్సరాల నుండి 19 సంవత్సరం పిల్లలకి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్లో,కాలేజీల్లో అల్బెండజోల్ టాబ్లెట్ వేయబడును,1 సంవత్సరం నుండి 2సంవత్సరం పిల్లలకి సగం టాబ్లెట్ మరియు 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరం పిల్లలకి పూర్తి టాబ్లెట్ చప్పరించాలని మండల వైద్యాధికారులు బి.శరణ్య, కట్ట రమేశ్ లు ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Post a Comment

0 Comments