JSON Variables

లారీలు రాక రైతుల ఆందోళన

లారీలు రాక రైతుల ఆందోళన
 - రాస్తారోకో చేస్తున్న రైతులు
 న్యూస్ పవర్, 24 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వెంకట రావు పల్లె గ్రామంలో ధాన్యం - తరలించడానికి లారీలు రాకపోవడముతో  రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ధాన్యం తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లుకు తరలించడంలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  ప్రతి సీజన్లో వేల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినా నిర్వాహకులు మాత్రం ఏర్పాట్లు సరిగా చేయడం లేదన్నారు. లారీ డ్రైవర్లు ఒక బస్తాకు 3 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని వాపోయారు. ఒక బస్తాకు 42.500 కిలోలు తూకం వేస్తున్నారని అన్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజుల తరబడి కేంద్రాల్లో ఉండడం వల్ల తరుగు ఏర్పడుతుందని వాపోయారు. వడ్లలో తాలు పేరుతో ఇబ్బంది. పెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మండలంలో ని రేపాక రెవెన్యూ చాలా పెద్దది అందులో ఐదు గ్రామపంచాయతీ లు రెండు ఎంపీటీసీ స్థానాలు అలాంటి పరిధిలో ఒక పాక్స్ చైర్మన్, ఒక రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు, ఒక మండల పరిషత్ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఇద్దరు. ఇంతమంది ఉండి కూడా మాకు లారీలు వస్తలేవు అని రోడెక్కే పరిస్థితి దాపురించినందుకు సిగ్గు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. లారీలే లేని వానికి కాంటాక్ట్ ఇచ్చి లారీలు పంపమని అడుగుతే ఎక్కడి నుంచి పంపిస్తాడు అన్నారు.

Post a Comment

0 Comments