JSON Variables

ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు

ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు 
 - ఉద్యాన వన పంటలు సాగు చేయడం వల్ల  , రైతులకు స్థిరమైన వార్షిక ఆదాయం
- 90% రాయితీ తో , బిందు సేద్య పరికరాలు ఎస్సీ,ఎస్టీ రైతులకు పూర్తి రాయితీ , బీసీ , జనరల్ రైతులకు 5 ఎకరాల లోపు ఉంటే 80% రాయితీ 
- వ్యవసాయ అధికారి ఏమ్. సురేష్ రెడ్డి 
శనార్థి తెలంగాణ , రాజన్న సిరిసిల్ల:
ఇల్లంతకుంట రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, కార్యక్రమం లో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఏమ్. సురేష్ రెడ్డి  మాట్లాడుతూ రైతులు ఉద్యాన వన పంటలు సాగు చేయడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని , రైతులకు స్థిరమైన వార్షిక ఆదాయం పొందుతారు అని అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన కూడా రైతులు నష్టపోకుండా ఆర్థికంగా కృంగిపోకుండా ఉద్యాన పంటలు కాపాడతాయి అని తెలియ జేయడం జరిగింది.ఆయిల్ పామ్ మొక్కలు 90% రాయితీ తో , బిందు సేద్య పరికరాలు ఎస్సీ,ఎస్టీ  రైతులకు పూర్తి రాయితీ , బీసీ , జనరల్ రైతులకు 5 ఎకరాల లోపు ఉంటే 80% రాయితీ తో ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు , పంట 4 సంవత్సరాల కాలానికి గాను ఎకరాకు 4200 చొప్పున ప్రతి సంవత్సరం నిర్వహణ ఖర్చులు చెల్లించడం జరుగుతుంది.మార్కెటింగ్ సదుపాయం ప్రియునిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ వారు బై బ్యాక్ అగ్రిమెంట్ ఇస్తున్నారు అని తెియజేయబడింది జరిగింది. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు చిట్టి వెంకట రాజా రెడ్డి కి ప్రోత్సాహక సన్మానం చేయడం జరిగింది,కార్యక్రమం లో ఉద్యాన వన అధికారి స్రవంతి ,వ్యవసాయ విస్తరణ అధికారి గంగ ప్రియునిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ ఆఫీసర్ కార్తిక్ , రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments