JSON Variables

ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల కోసం బిక్షాటన

ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో  డిగ్రీ కళాశాల కోసం బిక్షాటన

న్యూస్ పవర్, 28 మే ,  రాజన్న సిరిసిల్ల జిల్లా :
ఇల్లంతకుంట మండలంలోనీ స్థానిక బస్టాండ్ ఆవరణలో బిక్షాటన  చేసిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ 2014&2018  ఎన్నికల్లో మండలానికి డిగ్రీ కళాశాల నిర్మిస్తాము అని స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ & స్థానిక మండల జడ్పీటీసీ సిద్ధం వేణు  ఇచ్చిన హామీని మరిచిపోయారా అని మండల కేంద్రం లో డిగ్రీ కళాశాల లేక దాదాపు ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా విద్యార్థులు కరీనగర్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని పైగా బస్సులు సమయానికి రాక ప్రైవేట్ కళాశాల్లో ఫీజులు కట్టలేక  తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు అని మరి కొంత మంది విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లలేక ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు అని ఇప్పటికి అయినా మేలుకొని ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవాలి అని లేని పక్షం లో రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరిచాలి అని అన్నారు ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ కూనబోయిన ప్రవీణ్,  కుమ్మరివేణి అజయ్ రాకేష్, సునీల్, కిరణ్, అజయ్, మల్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments