JSON Variables

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 


---మూడు రోజులపాటు ఉత్సాహకంగా కొనసాగిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు.

యువత చదువుతో పాటు  క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈల్లంతకుంట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న మండల స్థాయి కబడ్డీ,వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహమతులు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ 

కబడ్డీ

1st ప్లేస్ ఇల్లంతకుంట
2nd ప్లేస్ జావారిపెట

వాలీబాల్

1st ప్లేస్ రేపాక
2nd ప్లేస్ వంతడుపుల
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ...క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని,ఏ ఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలి అన్నారు, ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు.ఇక్కడ కి వచ్చిన క్రీడాకారులు  మంచి ప్రతిభ చూపించారూ అన్నారు. భవిష్యత్తు లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ఆడాలని  అన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు ,క్రీడలపై దృష్టి సారించాలి.క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికి దోహదపడుతాయి. స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.యువకులు చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ  ఆకాంక్షించారు.పోలీస్ లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రతే మా భాద్యత అని ఎస్పీ  అన్నారు.మండల స్థాయిలో ఇంత మంచి క్రీడలు నిర్వహించిన సి.ఐ ఉపేందర్,ఎస్.ఐ రాజేష్ ఈల్లంతకుంట పోలీస్ వారిని అభినదించిన ఎస్పీ 
ఈ కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ రాజేష్, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments