JSON Variables

విద్యా సంవత్సరం ప్రారంభం లోగా జిల్లాలోని 172 ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

విద్యా సంవత్సరం ప్రారంభంలోగా 

జిల్లాలోని 172 ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

న్యూస్ పవర్, 11 మే , ఇల్లంతకుంట :
మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద తొలి విడత జిల్లాలోని 172 పాఠశాలల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి   విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలల్లో మంచి సదుపాయాలు ఉండేలా చూస్తామని చెప్పారు.
గురువారం ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను సందర్శించి మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
‘మన ఊరు మనబడి’ వర్క్స్​ స్పీడప్​ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడుల్లో చేపట్టిన ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, ఇతర రిపేర్ల ను త్వరగా కంప్లీట్​ చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ....
విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు.


శభాష్.....సహస్ర


- హెల్పింగ్ హాండ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ యంత్ర రూపకర్తకు కలెక్టర్ అభినందన
- రూపకర్త ఇల్లంతకుంట zphs లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని

ఇల్లంతకుంట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హెల్పింగ్ హాండ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ యంత్రాన్ని రూపొందించిన సహస్రను జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అభినందించారు.

మన ఊరు మనబడి కార్యక్రమానికి కింద చేపట్టిన పనులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఇల్లంతకుంట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇన్స్పైర్ లో జాతీయ స్థాయికి ఎంపికైన హెల్పింగ్ హాండ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ యంత్రాన్ని పరిశీలించారు. దాని పని విధానంను యంత్ర రూపకర్త సహస్రను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆవిష్కరణ చేసిన చిన్నారి సహస్ర తో పాటు విద్యార్థికి గైడ్ గా వ్యవహరిస్తున్న ఆ పాఠశాల సైన్స్ టీచర్ మహేష్ చంద్రను అభినందించారు. సహస్రలాంటి విద్యార్థినులు తమను తామే కాకుండా మనందరినీ గర్వపడేలా చేస్తారని అన్నారు. ఇలాంటి మరెన్నో ప్రయోగాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర బిందు కావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు . సహస్రలాంటి వైజ్ఞానిక అభిరుచి, జిజ్ఞాస గల విద్యార్థి, విద్యార్థినులను గుర్తించి వారందరికీ ఎక్స్పోజర్ విజిట్ ను ఏర్పాటు చేయాలన్నారు.  వారందరూ  కొత్త కొత్త ఆవిష్కరణలను చేసేలా ప్రోత్సహించడమే  కాకుండా పారిశ్రామికవేత్తలుగా రాణించేలా  చిన్నప్పటి నుంచే వారిలో ఆలోచనలు రేకెత్తించాలన్నారు.


జిల్లాలో 2.5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాo

అంతకుముందు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అర్హులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండున్నర లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్లద్దాలను అందజేశామని ఇలా కలెక్టర్ తెలిపారు . మిగిలిన వారందరికీ నిర్దేశిత గడువులోగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

వల్లంపట్ల వైకుంఠధామం,కంపోస్ట్ షెడ్ బాగుంది

ఇల్లంతకుంట మండల పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లంపట్ల గ్రామంలో వినియోగంలో ఉన్న వైకుంఠధామం ,కంపోస్టు షెడ్ ను పరిశీలించారు.
రెండు చాలా బాగున్నాయని గుడ్ వర్క్ అంటూ ప్రశంసించారు. 
పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీ రాములు, జిల్లా విద్యాధికారి ఏ రమేష్, జిల్లా అదనపు డిఆర్డిఓ మదన్ మోహన్, స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులున్నారు.

Post a Comment

0 Comments