JSON Variables

ఘనంగా దుద్దిల్ల శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలు

ఘనంగా  దుద్దిల్ల శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలు

 న్యూస్ పవర్ , 30మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మానుకోండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటి కార్యదర్శి మాజీ మంత్రి మంథని శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలను బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా కేక్ కటి చేసి పలు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణి చేసి ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ విప్ గా మొదలైనా రాజకీయ ప్రస్థానం టిటిడి బోర్డ్ మెంబర్ గా,వివిధ శాఖలకు మంత్రి గా సేవలదించిన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీలో జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి నేడు దేశస్థాయిలో పదవులు నిర్వహిస్తున్నారని ఆయన చేసిన సేవలను కోనియాడారు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అహర్నశలు పనిచేస్తున్నరని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, అంతగిరి బాలపోచయ్య, సీనియర్ నాయకులు ఓగ్గు రమేష్ మైనర్టీ అధ్యక్షుడు జమాల్, యస్ సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం,యసి సి సేల్ జిల్ల నాయకులు బడుగు లింగం,మండల నాయకులు గూడ నరేందర్, సిరికొండ నాగరాజు, యువజన కాంగ్రెస్ ప్రదానకార్యదర్శి శేఖర్,దాసు,న్యాత బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments