JSON Variables

జూనియర్ , ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులశాంతియుత నిరవధిక సమ్మె

జూనియర్ , ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల
శాంతియుత నిరవధిక సమ్మె

 న్యూస్ పవర్ , 29 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలానికి సంబంధించిన జూనియర్ , ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుయొక్క సర్వీస్ ను క్రమబద్ది కరించాలని  ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో శాంతియుత నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ప్రొబెషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని
 అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్ చేసి రెగ్యులర్ చేయాలనీ    విధి నిర్వహణలో మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ కారుణ్య నియామకాలు చేపట్టాలనీ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ (స్టెన్త్ నిర్ధారించి ప్రకటించాలనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో 
చంద్రశేఖర్, రంజిత్, ప్రియాంక మరియు అరుణ తో పాటు 18 మంది జూనియర్ మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments