మన ఊరు మన బడి పనులను పర్యవేక్షించిన జిల్లా విద్యాధికారి
న్యూస్ పవర్ , 28 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలము లో మన ఊరు మన బడి పనులను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పర్యవేక్షించారు,ముందుగా మండల విద్యాధికారి కార్యాలయం కు చేరుకొని యూనిఫా0 వివరాలు మరియు మన ఊరు మనబడి పనుల ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నారు , జెడ్పీ హెచ్ ఎస్ ఇల్లంతకుంట , వివిధ పాఠశాలలను సందర్శించి మన ఊరు మన బడి పనుల లలో వేగం పెంచాలని సూచించారు ..కార్యక్రమంలో సి అర్ పి లు నర్సయ్య ,మల్లేశం , సి సి ఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 Comments