JSON Variables

సమస్యల పరిష్కారానికై ఐకేపీ వీవోఏల సమ్మె నోటీసు

సమస్యల పరిష్కారానికై ఐకేపీ వీవోఏల సమ్మె నోటీసు
 న్యూస్ పవర్ , 19 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
వీవోఏల  సమస్య పరిష్కారానికి మరియు  
డిమాండ్ల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని మండల ఐకేపీ, సెర్ప్‌ వీవోఏలు తీర్మానించారు,బుధవారం నాడు మండల అధ్యక్షురాలు అనురాధ ఆధ్వర్యంలో ఎంపీపీ  ఊట్కూరి వెంకట రమణ రెడ్డి తో పాటు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏపిఎం లకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది, వీఓవోలకు కనీస వేతనంనలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, జీవో నం. 58ని సవ రించాలని డిమాండ్‌ చేశారు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న గ్రామైక్య సంఘం సహాయకులు గురువారం సమ్మె చేపట్టారు, వీవోఏల సంఘం అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ రూ.3 వేల వేతనంతో ఆర్థిక ఇబ్బందులు పడుతు న్నామన్నారు, ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు, అన్నపూర్ణ, పద్మ, భాలలక్ష్మి, రేణుక,అన్ని గ్రామాల వి ఓఏ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments