JSON Variables

యువత పట్ల నిర్లక్ష్యం ఎందుకు


యువత పట్ల నిర్లక్ష్యం ఎందుకు

 - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& మానకోండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ.
జనం న్యూస్ , 19 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
నేడు ఇల్లంతకుంట మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ  మాట్లాడుతూ ఇల్లంతకుంట లో మిని స్టేడియం కడుతా అని శాసన సభ్యుడు రసామయి బాలకిషన్ హమీ ఇచ్చి పోలిస్ శాఖకు సంభందించిన స్థలంలో సుమారు 25 లక్షలరూపాయలు ఖర్చు చేసి దానికి తెలంగాణ క్రీడామైదనం అని నామకరణం చేసి ఆగమేఘాలమీద ప్రారంభించారు. దాంట్లో నీ కమీషన్  ఎంత తీసుకున్నవో ప్రజలకు చెప్పలని డిమాండ్ చేశారు. పోలిస్ శాఖ వారు ఆటస్థలం పాలిస్ శాఖ వారిది దీంట్లో గ్రామస్తులు,క్రీడాకారులు రావద్దని హెచ్చరిస్తే క్రీడాకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే నీకు కనబడడంలేదా అన్నారు.వెంటనే క్రీడాస్థలం ఏర్పటు చేయలని డిమండ్ చేశారు. అదేవిధంగా యువజన సంఘం బిల్డింగ్,వివిధ కుల సంఘల భవనాలకు శిలాఫలకం వేసి నీ వాట ముట్టంగానే పనులు ఆపేస్తున్నారు. డబల్ బెడ్రూం కట్టి ఇప్పటివరకు ఎందుకు పంపిణీ చేయడం లేదు అందులో నీకు కమీషన్ లు ముట్టలేదా త్వరలోనే అర్హులైన వారందరికి వెంటనే ఇవ్వలని అధికారులను కోరారు.నిన్న జరిగిన ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నీ వాళ్లే వచ్చిందన్నారు. సర్పంచ్ లు ఆధైర్యపడోద్దు వారికి మేము అండగా ఉండికోట్లడూతమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్ల కాంగ్రెస్ ఉపాద్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు బాలపోచయ్య, ఓగ్గు రమేష్, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్ , యసి సి సేల్ నాయకులు బడుగు లింగం, మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , సురేందర్ రెడ్డి, గూడ నరేందర్ రెడ్డి ,సాగర్, దూస రాజు, అంజయ్య , రమణ రెడ్డి, భారత్ రెడ్డి,నాగరాజు,మహేందర్ రెడ్డి, స్వామి వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామల్లో చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Post a Comment

0 Comments