*క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని యువకుల మౌన దీక్ష*
- క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని యువకులు ఎమ్మెల్యే కు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన పట్టించకపోవడం లేదని అవేదన
- 20లక్షల రూపాయలతో పోలిస్ స్టేషన్ పక్కనున్న స్థలాన్ని అభివృద్ధి పోలిస్ శాఖకు చేందినది అని మమ్మల్ని గ్రౌండ్ నుండి వెళ్లిపోవాలని పోలీసులు
- అధికారులు స్పందించి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి
శనార్తి తెలంగాణ, రాజన్న సిరిసిల్ల:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని యువకులు ఎమ్మెల్యే కు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన పట్టించకపోవడం లేదని మంగళవారం రోజున ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి గ్రామ యువకులు వినతిపత్రం అందిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్ష చేశారు అనంతరం పలువురు యువకులు మాట్లాడుతూ క్రీడా మైదానం కోసం 20లక్షల రూపాయలతో పోలిస్ స్టేషన్ పక్కనున్న స్థలాన్ని అభివృద్ధి చేశారని అక్కడికి ఆడుకోవడానికి వాలిబాల్ పోల్స్ ,నేటితో , లైటింగ్ ఏర్పాటు చేసుకున్న తరువాత మా నెట్టును తొలగించిన స్థానిక పోలీసులు ఎందుకు తొలగించాలని అడిగితే. ఈ స్థలం పోలిస్ శాఖకు చేందినది అని మమ్మల్ని గ్రౌండ్ నుండి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు , అని మేము కొన్ని సంవత్సరం నుండి గ్రౌండ్ కావలనీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ప్రజా ప్రతినిధులకు , అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన స్పందన లేదు అని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని యువకులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 Comments