JSON Variables

మహిళా సంఘాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంఘాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం 

- ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్

న్యూస్ పవర్, 20 మార్చి, ఇల్లంతకుంట :
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ అన్నారు,  సోమవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో వడ్డీలేని రుణాల ప్రొసీడింగ్స్ ను మహిళా సంఘాల సభ్యులకు స్థానిక సర్పంచ్ బిలవేణి పర్శరాములుతో కలిసి అందజేశారు,
 ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు, మహిళల అభివృద్ధికి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్  వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నారని అన్నారు, రహేంఖాన్ పేట గ్రామంలో 32 మహిళా సంఘాలకు దాదాపు 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్స్ ని మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా మహిళలు కేసిఆర్ కి , మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలవేణి పర్శరాములు , పంచాయితీ కార్యదర్శి సంధ్య , సి. ఏ దొంతి పద్మ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య , ప్యాక్స్ డైరెక్టర్ కట్ట లచ్చయ్య , మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments