JSON Variables

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

 న్యూస్ పవర్ , 20 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంత కుంట మండలం రంగంపేట, వల్లం పట్ల గ్రామం లో ఏరువాక కేంద్రం శాస్ర్తవేత్త మరియు ఇంఛార్జి కోఆర్డినేటర్, డా. ఎం. రాజేద్రప్రసాద్ మాట్లాడుతు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి లో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావంపై రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మొగి పురుగు లక్షణాలు, నివారణ చర్యలు తెలియజేయడం జరిగింది. నారుమడి లో మరియు పిలక దశ లో ఆశిస్తే మొక్కలు 
ఎండి చనిపోతావి, అంకురం నుండి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈనిన తరువాత తెల్ల కంకులు బయటికి వస్తాయి. ఆలస్యంగా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు వుండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ వుంటే ఈ పురుగు రావడానికి అనుకూలం.ముదురు గోధుమ,
ఎoడుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కల పై నల్లటి మచ్చ కలిగి వుంటాయి.తెలుపు గోధుమ రంగు లో వుండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తరువాత నారింజ పసుపు రంగు తల కలిగి వుంటుంది. నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి నీటిని ఆ మడిలో నే ఇంకేటట్లు చేయాలి. ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలి.  నాట్లు వేసిన 10 నుండి 15 రోజులలో కార్బోప్యురాన్ 3 జి గుళికలను ఏకరానికి 10 కి లో ల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోలు చల్లుకోవాలి. ఎక్కువగా ఉన్నప్పుడు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి. 400 గ్రా/ ఎకరాకు లేదా ప్రోఫెనఫోస్ 400 మి. లి ఎకరాకు పిచికారి చేసుకోవాలి. సల్ఫయిడ్  నివారణకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా చల్లకుండా చూసుకోవాలి. మురికి నీరుని తీసేసి సన్నటి పగుళ్లు వచ్చేవరకు వరి పొలాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా సల్ఫయిడ్ దుష్ప్రభావాన్ని నియంత్రించుకోవచ్చు. ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు లత శ్రీ, అర్చన,వల్లంపట్ల సర్పంచ్ కేతిరెడ్డి అనసూర్య వెంకటనర్సింహ రెడ్డి మరియు  రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments