JSON Variables

చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి

చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి 
 న్యూస్ పవర్ , 17 జనవరి , ఇల్లంతకుంట :
 ఈరోజు ముస్కాన్ పేట గ్రామంలో చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి హమాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సావన పెళ్లి రాములు  కరపత్రం ఆవిష్కరణ చేశాడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 23న కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంటుందని కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాములు కోరాడు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీలకు కూలి రేట్లు నిర్ణయించి ప్రభుత్వమే చెల్లించాలని హమాలీలకు హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుందని జిల్లా నలుమూల నుండి హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరాడు,
 ఈ కార్యక్రమంలో అంజి రమేష్ కనకయ్య నాగరాజు హరీష్ సంపత్ వంశీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments