JSON Variables

సబ్సిడీ బియ్యం కొనసాగించాలి

సబ్సిడీ బియ్యం కొనసాగించాలి
రేషన్ షాప్ ద్వారా 16 రకాల వస్తువులు అందించాలి 
గన్నేరం నర్సయ్య నరసయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

 ఈరోజు ఇల్లంతకుంట తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత
 ఈ సందర్భంగా  నర్సయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి సబ్సిడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని చూస్తున్నాయని  పేదలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలను కొనసాగించాలని
 పేదలకు  ఇస్తున్న సబ్సిడీ  సంబంధించి  పేదలకు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఆరు కిలోల నుండి 5 కిలోలకు కుదించాలనుకుంటున్నా ప్రభుత్వం
 నిర్ణయాన్ని విరమించుకోవాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయాలని చూస్తున్నాయని ఇట్టి ప్రయత్నాలు విరమించుకోవాలని కనీసం పేదలకు మూడు పూటలా తిండి అందడం లేదని ఈ సబ్సిడీ బియ్యం ద్వారా రెండు పూటలైన భోజనం చేస్తున్నారని కావున దేశవ్యాప్తంగా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రకాల వంట సామాన్లకు సంబంధించి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ప్రజలకు అందించాలని అలాగే మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను నిరంతరం స్వీకరించేలా చూడాలని చేసుకున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నూతన రేషన్ కార్డులను అందించాలని చేర్పులు మార్పులకు సంబంధించి ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి నర్సయ్య డిమాండ్ చేశారు ఈ 
కార్యక్రమంలో గారిగే రవి బైండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments