ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకై ఆమరణ దీక్ష చేసి నేటికి ఐదేళ్లు
ఇంకా కలగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు
న్యూస్ పవర్ , 7 జనవరి , ఇల్లంతకుంట : - ఇల్లంతకుంట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని 2018 జనవరి 8 వతేది తెలంగాణ యువజన విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పక్షాన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి నేటికి 5 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కలగానే మిగిపోయిందని బీజేపీ సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా అలనాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని ఎముకలు కొరికే చలిలో సైతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఇప్పటి వరకు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చలేక పోయిందని, డిగ్రీ, ఆపై చదువుల కోసం విద్యార్థులు కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 Comments