JSON Variables

సెస్ ఎన్నికల్లో విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నవారికి కూడా ఓటు హక్కు కల్పించాలి

 సెస్ ఎన్నికల్లో  విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నవారికి కూడా ఓటు హక్కు కల్పించాలి

 న్యూస్ పవర్, 28 నవంబర్ , ఇల్లంతకుంట :
సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల  విద్యుత్ బకాయిలు ఉన్నా సభ్యులకు సెస్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండాలని  రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల 1969 సంలో రిజిస్ట్రేషన్ చేసి దీనిపరిధిలో విద్యుత్ కనెక్షన్స్ వున్నా సభ్యులు బిల్లులు బకాయిలు ఉంటే సెస్ డైరెక్టర్స్ ఎన్నికల్లో ఓటు వేయరాదు నిబంధనలు తీసుకరావదాన్ని తీవ్రంగా వెతిరేకిస్తున్నామన్నారు, సెస్ ఎన్నికల్లో బకాయిలు వాళ్లందరిని కూడా ఓటు వేసేందుకు అర్హులు పరిగణించి ఓటు హక్కు కలిపించాలన్నారు. ఎందుకంటే ఉదాహరణ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇంటి పన్నులు బకాయిలు ఉన్నా ఓటు వేస్తారు, ఏ సహకార సంఘల సభ్యులు బకాయిలువున్నా డైరెక్టర్స్ ఎన్నికల్లో  ఓట్లు వేస్తున్నారు, కానీ ఈ సెస్ సభ్యులు బకాయిలు ఉంటే డైరెక్టర్స్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయరాదో చెప్పాలన్నారు, ఏ సహకార సంస్థలలో లేని నిబంధనలు ఇందులో ఎలా ఉంటాయాన్నారు, సెస్ లో 283000 సభ్యులు ఉంటే కేవలం 85000 మందికి మాత్రమే ఓటు హక్కు కలిపించటం ఏంటన్నారు,అంటే నూటికి 30% మందికి ఓటు హక్కు ఇస్తే వీళ్ళు ఓట్లు వేస్తేనే ఎలా గిలేలిచ్చినట్లు ఈ తీర్పును గౌరవిస్తారు,ఈ అసంబద్దమైనా ప్రజ వెతిరేక  నిబంధన తొలగించి వెంటనే నా జిల్లాలోని  బకాయిలు వున్నా సభ్యులందరికి సెస్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నరు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి చెప్యాల.గంగాధర్, గజ్జల. శ్రీనివాస్, పల్లె. సాయిప్రశద్ రెడ్డిలు వున్నారు.

Post a Comment

0 Comments