JSON Variables

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

 న్యూస్ పవర్ , 28 నవంబర్ , ఇల్లంతకుంట :
బండి సంజయ్ పాద యాత్ర ను అడ్డుకోవడం అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టి బొమ్మ ను దహనం చెయ్యడం జరిగింది, ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ  కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు 
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడం పిరికిపంద చర్య-
ఓటమి భయంతోనే కెసిఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అన్నారు ,
తెలంగాణలో బిజెపి బలపడుతుందని కెసిఆర్ జీర్ణించుకో లేక ఇటువంటి దుచర్యలకు తెగిస్తున్నరని, ఈ అవినీతి పాలనతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది కావున తెలంగాణ ప్రజానీకం అంత బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు అని తెలిపారు ఇదే విధంగా అధికార దుర్వినియోగానికి పూనుకుంటే ప్రజలు తగిన బుద్ది చెప్పే కాలం దగ్గరలోనే ఉంది అని తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి ఆశయాలు కేవలం బీజేపీ తోనే సాధ్యమని తెలిపారు, ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేశెట్టీ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, సింగిరి శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, దళిత మోర్చ మండల ప్రధాన కార్యదర్శి, ఓ బి సి  మోర్చ మండల ప్రధాన కార్యదర్శి వజ్జేపల్లి శ్రీకాంత్, దాసరి శ్యామ్, దుర్ముట్ల ప్రశాంత్, పొట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments