JSON Variables

_స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక అభివృద్ది సాదించాలి

_స్వయం ఉపాధితో  మహిళలు ఆర్థిక అభివృద్ది సాదించాలి..

_పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో  రోడ్డు మరమత్తు పనులు త్వరగ పూర్తి చేయాలి_

_డాక్టర్  రసమయి బాలకిషన్_
_మానకొండూర్ శాసన సభ్యుడు 
 న్యూస్ పవర్ , 23 నవంబర్ , ఇల్లంతకుంట :
  ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ రోజు  డా!! బిఆర్.అంభేడ్కర్    విగ్రహాం నుండి జిల్లెల్ల x రోడ్డు వరకు రోడ్డు మరమ్మత్తుకు  భూమి పూజ చేసి,అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక లో  ఎస్ సి కార్పోరిషన్ ద్వార నెహ్రూ కుట్టు మిషన్  ఆద్వర్యంలో  కుట్టు శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు దృవీకరణ పత్రాలతో పాటు కుట్టుమిషన్ లను అందజేసాడు,
అనంతరం రసమయి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలతో  రోడ్డు మరమత్తు పనులు త్వరగ పూర్తి చేయాలి   అని అన్నారు. రోడ్డు రవణా శాఖా మంత్రికి మానకొండూర్ నియోజకవర్గంలో కరాబైన రోడ్ల గురించి వారి దృష్టికి తీసుకవెళ్లామని వారు కూడా సానుకులంగా స్పందిచారని అన్నారు, మానకొండూర్ నియోజకవర్గంలో  బీటి రోడ్లు అన్ని త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.ఇప్పటికే దాదాపు గ్రామాలలో సి సి రోడ్లు 90% పూర్తి చేసుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో సంక్షేమమే ఎజెండాగా సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం..జీవనదిలా సంక్షేమ పథకాలు.. అర్హత కలిగిన ప్రతి పేదింటి కి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరెవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇందుకోసం మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోందని అన్నారు,
 గ్రామీణ మహిళల్లో సృజనాత్మకత నైపు ణ్యత ఉన్న విద్యార్హత లేని కార ణంగా వెనుకబడి పోతున్నారని అన్నారు.పేద మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భరోసాగా ఉండాలని వారు  వారు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది వారి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ఉన్నత చదు వులు చదివించే అవకాశం కలుగు తోందని అన్నారు.

Post a Comment

0 Comments