JSON Variables

గ్రంధాలయాన్ని యువత ఉపయోగించుకోవాలి

గ్రంధాలయాన్ని యువత ఉపయోగించుకోవాలి
▪️చైర్మన్ ఆకునూరు శంకరయ్య


 

న్యూస్ పవర్ , 17 నవంబర్ , ఇల్లంతకుంట :
 55వ జిల్లా గ్రంధాలయ వారోత్సవాల లో భాగంగా ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా డైరెక్టర్ మల్లంకి శ్రీనివాస్  ఆధ్వర్యంలో విద్యార్థిని,విద్యార్థులకు గ్రంథాలయాల పాత్ర గురించి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన గ్రంధాలయ చైర్మన్ శంకరయ్య  రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు  మాట్లాడుతూ, యువత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చదువుతోపాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఈ ప్రపంచంలో చదువు లేకుంటే విలువ లేదని ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడం కోసం ప్రతి విద్యార్థి మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అవరోహించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా  గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ మల్లెoకి శ్రీనివాస్ ,సర్పంచ్ కునబోయిన భాగ్య లక్ష్మి - బాలరాజు ,ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్ ,ఉప సర్పంచ్ ఎండీ సాదులు , కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వర రావు గారు,జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రెటరీ బుగ్గ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల బుర్ర సూర్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పొన్నం శేఖర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి గారు,తెరాస మరియు కాలేజ్ స్టాఫ్,సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments