JSON Variables

దీర్ఘకాలిక రుణాలు అందజేత

దీర్ఘకాలిక రుణాలు అందజేత

 న్యూస్ పవర్ , 25 నవంబర్, ఇల్లంతకుంట :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇల్లంతకుంట వారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు రొండ్ల తిరుపతి రెడ్డి  ఈరోజు సంఘ కార్యాలయంలో సంఘం నుండి దీర్ఘకాలిక రుణాల క్రింద పశువుల పెంపకం మరియు గొర్రెల పెంపకం వంటి వాటి పై రుణాలను రైతులకు అందించే క్రమంలో భాగంగా ఈరోజు సంఘ అధ్యక్షుడు  రొండ్ల తిరుపతి రెడ్డి  చేతుల మీదుగా దీర్ఘకాలిక రుణాల క్రింద 59 లక్షలకు సంభందించిన రుణాల చెక్కులను అనంతగిరి, పొత్తూరు, కంది కట్కూర్, చింతలకుంట పల్లె, సిరికొండ, తెలుగువానిపల్లి, ఓగులాపూర్, వెల్జిపూర్, సోమరం పేట, ముస్కాన్ పేట గ్రామాలకు  17 చెందిన రైతులకు అందించడం జరిగింది,

ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం గత ఎనిమిది సంవత్సరాలుగా సంఘ సభ్యులకు రైతులకు కావలసిన రుణాలను దీర్ఘకాలిక రుణాలు కావచ్చు లేక పంట రుణాలు ను అందించడం జరుగుతుందని తెలియజేశారు, రైతు ఆర్థికంగా బలోపేతం కావడానికి రైతులందరూ సంఘం ద్వారా రుణాలు పొంది అభివృద్ధి చెందాలని తెలియజేశారు, అదేవిధంగా రైతులకు కావలసిన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను సకాలంలో అందించుటకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టేస్ క్యాబ్  బ్యాంక్ మరియు కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్  కొండూరి రవీందర్ రావు మరియు కే డి డి సి సి సి ఇ ఓ సత్యనారాయణ రావు , అధ్యక్షుడు  రొండ్ల తిరుపతి రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘ సి ఇ ఓ చిట్టి రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు చల్లా నవీన్ రెడ్డి, జంగిటి కొమరయ్య, పల్లె సృజన్ రెడ్డి, నాయిని నవీన్ కుమార్, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments